కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి : చాడ వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

జనగామ అర్బన్, వెలుగు : హమాలీ వర్కర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు ఆర్థికసాయం పెంచాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆదివారం జనగామలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయన్నారు.

సమస్యలు సాధించేవరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సహజ మరణానికి ఇచ్చే ఆర్థికసాయాన్ని రూ. 5 లక్షలకు, ప్రమాద బీమాను రూ. 10 లక్షలకు పెంచాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.రాజారెడ్డి, పాతూరు సుగుణమ్మ, ఆకుల శ్రీనివాస్, లింగాల రాములు, ఉపేందర్, రాజుయాకూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మల్లయ్య, ఉప్పలయ్య పాల్గొన్నారు.