బీజేపీ పాలనలో దేశంలో పేదలు పెరిగారు : చాడ వెంకట్ రెడ్డి

సిరిసిల్ల టౌన్ వెలుగు: పదేండ్ల బీజేపీ పాలనలో దేశంలో పేదలు పెరిగారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉపాధి హామీ కార్మికుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతాంగ పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుందని, అయితే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలేదన్నారు.

వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్లాన్​ చేస్తోందని, ఇందులో భాగంగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు.  బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, మతతత్వ విధానాల ఫలితంగా ప్రజలు పేదవారుగా మారుతున్నారన్నారు. కార్యక్రమంలో  వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం బాల మల్లేశ్ ‌‌‌‌‌‌‌‌, జిల్లా ఉపాధ్యక్షుడు సోమ నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, జిల్లా కార్యదర్శి కడారి రాములు తదితరులు పాల్గొన్నారు.