అంగన్‌‌వాడీలతో చర్చలు జరపాలె : చాడ వెంకట్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: అంగన్‌‌వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మహిళలు సమ్మె చేయడం మంచిది కాదని..వారితో  చర్చలు జరపాలని సీఎం కేసీఆర్​కు సూచించారు. 

ALSO  READ :- పై ఆఫీసర్లకు నై.. ప్రజాప్రతినిధులకు జై .. వివాదాస్పదంగా ఖాకీల వైఖరి

రాష్ట్రంలో 16 రోజులుగా దాదాపు 60 వేల మంది అంగన్‌‌వాడీ ఎంప్లాయీస్ సమ్మె  చేస్తున్నారని గుర్తుచేశారు. దీనివల్ల 15 వేల గ్రామాలు, తండాల్లోని చిన్నారులు పోషకాహారం అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించినా, కేవలం రూ.10 వేల నుంచి 12 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌‌వాడీల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినవారే ఉన్నారని చాడ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.