రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేయించడానికి CPI తరఫున ఎన్నో పోరాటాలు చేశామన్నారు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ఏడాది నుంచి పని చేస్తున్న ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి ప్రధాని మోడీ రావడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రామగుండంతో పాటు సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. మోడీ పర్యటన సందర్భంగా నిరసనలకు పిలుపునిచ్చారు CPI లీడర్లు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెలంగాణ కు వరప్రసాదం లాంటిదని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పున:ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని విమర్శించారు. అక్రమంగా ఏపీలో కలిపిన భద్రాచలం మండలానికి సంబంధించిన ఐదు గ్రామాలు తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం బొగ్గుబావుల ఆధారితంగా నడుస్తుందన్నారు.