బీఆర్ఎస్ పార్టీతో ఎన్నికల పొత్తులు వేరు.. రాజకీయాలు వేరు

వీర్నపల్లి,  వెలుగు: బీఆర్ఎస్ పార్టీతో ఎన్నికల పొత్తులు వేరని రాజకీయాలు వేరని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య యాత్ర శనివారం సాయంత్రం వీర్నపల్లి మండలానికి చేరుకుంది.  ముఖ్యఅతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ..  పేద ప్రజలకు అండగా నిలిచేది కమ్యూనిస్టులేనని, కన్నతల్లి లాంటి సీపీఐ పార్టీని ప్రజలు మరువవద్దన్నారు. మండల కేంద్రంలోని వెంకట్రాయిని చెరువులో భూములు కోల్పోతున్న రైతుల సమస్య, పోడు భూముల సమస్య పై సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు, జిల్లా రైతు సంఘం కార్యదర్శి జంగం అంజయ్య, స్థానిక ఎంపీటీసీ అరుణ్ కుమార్,  సీపీఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.