'చెడ్డి గ్యాంగ్ తమాషా' టైటిల్ టీజర్

'చెడ్డి గ్యాంగ్ తమాషా' టైటిల్ టీజర్

అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీలీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'చెడ్డి గ్యాంగ్ తమాషా'. సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్ టీజర్ ను ప్రముఖ నటుడు సునీల్ ఇవాళ లాంఛ్ చేశారు. వెంకట్ కల్యాణ్ హీరోగా, గాయత్రి పటేల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వెంకట్ కల్యాణ్ అందిస్తున్నారు.

'చెడ్డీ గ్యాంగ్ తమాషా' చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్స్ లో చూసి కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేయాలని..చేస్తారని కోరుకుంటున్నానని సునీల్ అన్నారు. సునీల్ చేతుల మీదగా మా 'చెడ్డి గ్యాంగ్ తమాషా' మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ కావడం చాలా హ్యాపీగా ఉందని చిత్రం నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ అన్నారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని.. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.