
హైదరాబాద్లోని చాదర్ఘాట్ లో అనుమానస్పదంగా మృతిచెందిన శిరీష కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శిరీషది సహజ మరణం కాదని పోస్టుమారం నివేదిక ద్వారా తేలింది. శిరీషను ఊపిరాడకుండా చేసి చంపారని డాక్టర్లు పోలీసులకు తెలిపారు. దీంతో అనుమానాస్పద మృతి కేసును మర్డర్ కేసుగా మార్చారు చాదర్ ఘాట్ పోలీసులు. ఉస్మానియా దగ్గర శిరీష భర్త వినయ్ కుమార్,అతని అక్క, చెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిరీష మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించారు పోలీసులు. శిరీషను ఎందుక చంపాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ న్యూ మలక్ పేట జమున టవర్స్ లో నివసిస్తున్న శిరీష మార్చి 2న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. శిరీష స్వగ్రామం శ్రీశైలం సమీపంలోని దోమలపేట. గుండెపోటు అని శిరీష తల్లిదండ్రులకు కాల్ చేసి ఆమె భర్త వినయ్ సమాచారం ఇచ్చాడు. శిరీష కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరకముందే ఆమె మృతదేహాన్ని సొంత గ్రామం శ్రీశైలం సమీపంలోని దోమల పెంటకు అంబులెన్సులో తరలిస్తుండగా పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో కొట్టి చంపి.. గుండెపోటుగా చెబుతున్నారని.. శిరీష భర్త గుండెపోటు కథ అల్లాడని చాదర్ ఘాట్ పోలీసులకు శిరీష కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో డెడ్ బాడీని పోస్టుమార్టం చేయగా శిరీషను ఊపిరాడకుండా చేసి చంపారని తేలింది.