
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ఆదివారం దుబాయ్ లోని దుబాయ్ ఇంటెర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచి రికార్డులు సృష్టించింది.. అయితే ఈ మ్యాచ్ చూడటానికి యంగ్ క్రికెటర్ చాహల్ తోపాటు ఆర్జే మహవాష్ కూడా వచ్చింది. దీంతో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని మ్యాచ్ చూస్తుండగా కెమెరాకి చిక్కారు.. దీంతో వీరిద్దరి గురించి పలు వార్తలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. దాంతో నెటిజన్లు ఆర్జే మహవాష్ గురించి ఇంటర్ నెట్ లో తెగ వెతుకుతున్నారు..
ఆర్జే మహవాష్ 1996లో ఉత్తరప్రదేశ్‌లో జన్మించింది.. చదువులు పూర్తయిన తర్వాత రేడియో జాకీగా పని చేస్తూ కెరీర్ మొదలుపెట్టింది.. అలాగే సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్ గా, ఇన్ఫ్లూ యెన్సర్ గా కూడా పని చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడికి సోషల్ మీడియాలో దాదాపుగా 1.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.. అయితే గతంలోకూడా మహవాష్ చాహల్ తో కలసి పలు సందర్భాల్లో కనిపించింది.
దీంతో ఆ సమయంలో వీరిద్దరిమమధ్య ఏదో ఉందంటూ లవ్, డేటింగ్, పెళ్లి అంటూ పుకార్లు వినిపించాయి. కానీ మహవాష్ మాత్రం తామిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని తమ మధ్య ఎలాంటి లవ్ రిలేషన్ లేదని క్లారిటీ ఇచ్చింది. అలాగే వ్యూస్ కోసం, పాపులర్ కావడం కోసం తన పేర్లు వాడద్దని హెచ్చరించింది.. ఈ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇద్దరూ దుబాయ్ లో కనిపించడంతో రూమర్స్ మరింత ఒప్పందుకున్నాయి. మరి ఈసారి ఎలా స్పందిస్తారో చూడాలి..
Also Read : దేశమంతా జియో హాట్ స్టార్‌లోనే
ఈ విషయం ఇలా ఉండగా క్రికెటర్ చాహల్ ఇటీవలే తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలో తన మాజీ భార్యకి పెద్ద మొత్తంలో భరణం కూడా చెల్లించినట్లు పలు వార్తలు బలంగా వినిపించాయి. కానీ ధనశ్రీ వర్మ పేరెంట్స్ మాత్రం ఈ విడాకుల అనంతరం తమ కూతురికి ఎలాంటి భరణం రాలేదని దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యొద్దని కోరారు.