లండన్: ఇండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్.. కౌంటీల్లో అదరగొట్టాడు. నార్తాంప్టన్‌షైర్ తరఫున బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో వన్డే కప్‌లో భాగంగా బుధవారం కెంట్ స్పిట్ఫైర్స్తో జరిగిన మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కెంట్ 35.1 ఓవర్లలో 82 రన్స్‌కే కుప్పకూలింది.
చహల్ తన మ్యాజిక్‌తో కెంట్ లైనప్‌ను కూల్చాడు. 10 ఓవర్లలో 14 రన్స్ ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. జైడెన్ డెన్లీ (22), ఎకాన్ష్ సింగ్ (10), గ్రాంట్ స్టీవార్ట్ (1), బేయర్స్ స్వాన్పోల్ (1), నేథన్ గిల్‌క్రిస్ట్ (6) వికెట్లు అతని ఖాతాలో ఉన్నాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నార్తాంప్టన్‌షైర్ 14 ఓవర్లలో 86/1 స్కోరు చేసి నెగ్గింది. ఈ సీజన్లో నార్తాంప్టన్‌కు ఇదే తొలి విజయం. గతంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడింది.