ఐపీఎల్లో షేన్ వార్న్ ప్రయాణం మరువలేనిది. 2008లో రాజస్థాన్కు నాయకత్వం వహించిన షేన్ వార్న్..ఎలాంటి అంచనాలు లేని జట్టును విజేతగా నిలిపాడు. ఐపీఎల్ తొలి ట్రోఫీని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. అలాగే తన బౌలింగ్తో ఎన్నో మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించాడు. అయితే రాజస్థాన్తో షేన్ వార్న్ ప్రస్థానం ముగిసిన తర్వాత జట్టుకు ఆ స్థాయి బౌలర్ దొరకలేదు. కానీ ఇన్నాళ్లుకు చాహల్ రూపంలో రాయల్స్ టీమ్కు సూపర్ స్పిన్నర్ లభించాడు. ఈ ఐపీఎల్లో చాహల్ ఇప్పటి వరకు 15 మ్యాచులు ఆడగా, 26 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ 2022లో ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో చాహల్ టాప్ ప్లేస్లో ఉన్నాడు.
వార్న్కు చాహల్ నివాళి..
అద్భుత బౌలింగ్తో రాజస్థాన్ను ప్లే ఆఫ్ చేర్చిన చాహల్ రాయల్స్ ఫస్ట్ కెప్టెన్ షేన్ వార్న్కు ఘన నివాళులు అర్పించాడు. రాజస్థాన్ రాయల్స్ తనకు చాలా ప్రత్యేకమైందన్నాడు చాహల్. తాను ఎంతో ఆరాధించే షేన్ వార్న్ ఆడిన రాజస్థాన్కు ఆడటం సంతోషంగా ఉందన్నాడు. తాను బౌలింగ్ చేస్తున్నప్పుడు వార్న్ బ్లెస్ చేస్తాడని నమ్ముతున్నట్లు చెప్పాడు. పై నుంచి వార్న్ సార్ తనను చూస్తునే ఉంటాడని భావిస్తున్నట్లు చాహల్ పేర్కొన్నాడు.
రాయల్స్ తో త్వరగా కనెక్ట్ అయ్యా
రాజస్థాన్ కు ఫస్ట్ టైం ఆడుతున్నా..ఎన్నో ఏళ్లుగా ఆడుతున్నట్లు అనిపిస్తుందన్నాడు చాహల్. రాజస్థాన్ జట్టును చూస్తే తన కుటుంబంలా ఉందన్నాడు. ఇక్కడ మానసికంగా రిలాక్స్గా ఉన్నానని తెలిపాడు. టీమ్ మేనేజ్మెంట్ తనను విలువైన ఆటగాడిగా చూస్తుందని చెప్పుకొచ్చాడు.
చాహల్ బౌలింగ్, టీమ్ విన్నింగ్..
ఈ ఐపీఎల్లో చాహల్ అద్భుతంగా చెలరేగుతున్నాడు. 15 మ్యాచుల్లో 26 వికెట్లు తీసుకుని టాప్లో కొనసాగుతున్నాయి. ఇందులో ఓసారి 4 వికెట్లు, మరోసారి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్..ఈ ఐపీఎల్లో హైలెట్. చాహల్ రాణించడంతో రాయల్స్ ఈ సీజన్ లో రెండో స్థానంతో ప్లేఆఫ్ కు చేరుకుంది.
Special feat deserves special celebration! ??
— IndianPremierLeague (@IPL) April 18, 2022
Hat-trick hero @yuzi_chahal! ? ?
Follow the match ▶️ https://t.co/f4zhSrBNHi#TATAIPL | #RRvKKR | @rajasthanroyals pic.twitter.com/NhAmkGdvxo