వేలంలో రికార్డ్ ధర పలికిన చాహల్.. సంతోషంలో ధనశ్రీ వర్మ

వేలంలో రికార్డ్ ధర పలికిన చాహల్.. సంతోషంలో ధనశ్రీ వర్మ

సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరుగుతోన్న ఐపీఎల్-2025 మెగా వేలం రసవత్తరంగా సాగుతోంది. తమకు కావాల్సిన ప్లేయర్ల కోసం ఫ్రాంచైజ్‎లు హోరా హోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా ప్లేయర్ల కోసం ఫ్రాంచైజ్‎లు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. ఇందులో భాగంగానే.. టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. చాహల్‎ను రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. 

చాహల్ కోసం ఇతర ప్రాంఛైజ్‎లు కూడా పోటీ పడగా.. చివర వరకు వేలంలో నిలిచి పంజాబ్ కైవసం చేసుకుంది. గత సీజన్‎లో చాహల్ రాజస్థాన్ రాయల్స్ తరుఫున ఆడాడు. నెక్ట్స్ సీజన్ కోసం ఆర్ఆర్ చాహల్‎ను రిటైన్ చేసుకోకపోవడంతో అతడు వేలంలోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో చాహల్ ను పంజాబ్ కింగ్స్ 18 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. 

ఇక, వేలానికి ముందు అందరూ ఊహించినట్లుగానే టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ఐపీఎల్‎ వేలంలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేశాడు. లక్నో సూపర్ జైయింట్స్ రూ.27 కోట్ల భారీ ధర వెచ్చించి రిషబ్ పంత్‎ను దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే అత్యధిక ధర. రిషబ్ పంత్ తర్వాత మరో ఇండియన్ స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. శ్రేయస్ అయ్యర్‎ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.