ఇదేందయ్యా ఇదీ : జుట్టును టీ పాట్ గా మార్చేశారు..

ఇదేందయ్యా ఇదీ : జుట్టును టీ పాట్ గా మార్చేశారు..

మగువకు జుట్టు ఎంతో అందాన్ని ఇస్తుంది.  పూర్వ కాలంలో జుట్టు ఊడిపోతుందంటే. .. వారు పడిన బాధ అంతా ఇంతా కాదు... సరే ఇప్పుడు కంప్యూటర్​ యుగంలో ఫిమేల్​ బార్బర్​ షాపులు కూడా వచ్చాయనుకోండి.. కాని స్త్రీకి జుట్టు  ఎంతో అందాన్ని ఇస్తుంది. జుట్టు ఉంటే ఏ కొప్పు అయినా పెట్టవచ్చు అనే సామెత ఉంది.. అలానే ఇప్పుడు ఓ మహిళ జుట్టుతో టీపాట్​ తయారు చేసింది. 

ఇరాన్‌కు చెందిన ఒక మహిళా హెయిర్ స్టైలిస్ట్ అద్భుతమైన హెయిర్ స్టైల్‌లను క్రియేట్ చేస్తున్న వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. సయీదే ఆర్యై అనే మహిళ నుండి వచ్చిన రీల్స్ .. ఒక మహిళ  జుట్టును విభిన్నమైన మార్గాల్లో స్టైలింగ్ చేస్తున్నాయి. ఆర్య తన మోడళ్లకు అనేక ఊహించలేని కేశాలంకరణను అందించింది. ఆమె ఇటీవలి వీడియోలలో ఒకటి ఆమె మోడల్ జుట్టును టీ పాట్‌గా షేప్ చేస్తున్నట్లు చూపిస్తుంది.

 ఇరాన్​కు చెందిన మహిళజుట్టుతో ఆమె తలపై అద్భుతాన్ని సృష్టించింది. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది.  ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే...ఇరాన్​ కు చెందిన ఆర్య అనే మహిళ జుట్టును అలంకరిస్తూ టీపాట్​ లాంటి షేప్​ను  తలపై రూపొందించింది.  ఆర్య వెరైటీ హెయిర్​ స్టైల్స్​ తో వీడియోలు వైరల్​ అవుతాయి. అయితే ఇప్పుడు saeidehariaei_hairstylist అనే ఇన్​ స్ట్రా ఖాతా నుంచి పోస్టు చేసిన ఆర్యకు చెందిన వీడియో వైరల్​ అవుతుంది. ఈ వీడియోలో హెయిర్ స్టైలిస్ట్ మోడల్  హెల్తీ హెయిర్‌ కనపడుతుంది.  ఇరానియన్​ హెయిర్​ డ్రస్సర్​ తెల్లటి గులాబీ రంగులో ఉన్న మోడల్​ జుట్టును టీ పాట్​గా మార్చింది.  ఈ వీడియోను ఇప్పటి వరకు ( వార్త రాసే సమయానికి)మూడు మిలియన్లకు పైగా జనాలు వీక్షించారు. 

తలపై సపోర్ట్​ స్ట్రక్చర్​ ఉంచి దాని చుట్టూ జుట్టును అమర్చారు. టీ పాట్​ ఆకారంలో జుట్టును ఉంచి అందులో నుంచి కొంచెం టీ పోసిన విధంగా వీడియోలో ఉంది.  ఈ విషయంలో ఆర్య మాట్లాడుతూ.. ఇప్పటికే ప్యాషన్ స్టైల్లో జుట్టుతో చాలా వీడియోలు తయారు చేశానని.. ఏదో ఒక మోడల్​ తయారు చేయాలనిపించి ఇలా తయారు చేశానని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా పుణ్యమా అని.. ఎవరు ఎలాంటి అద్భుతాలు సృష్టించినా క్షణాల్లో నెటిజన్లకు చేరుతున్నాయి.