![తక్కువ ధరకే ఇండియన్ స్ట్రీట్‌ఫుడ్](https://static.v6velugu.com/uploads/2022/06/'Chai-Pani'-Best-Indian-Restaurant-in-US_ZXbshSIMcW.jpg)
- తక్కువ ధరకే ఇండియన్ స్ట్రీట్‌ఫుడ్
వాషింగ్టన్: భారతీయ టేస్టీ ఫుడ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. తక్కువ ధరకే నోరూరించే స్ర్టీట్ఫుడ్దొరుకుతుంది. అమెరికాలో బెస్ట్ రెస్టారెంట్‌గా చాయ్ పానీ నిలిచింది. దీన్ని మెహెర్వాన్ ఇరానీ స్థాపించారు. ఇక్కడ చాలా తక్కువ ధరకు ఇండియన్ స్ర్టీట్ఫుడ్ అందుబాటులో ఉంచుతారు. చాయ్ పానీ అంటే.. ‘టీ’.. ‘నీరు’ అని అర్థం. చాట్‌కు చాయ్‌పానీ రెస్టారెంట్పెట్టింది పేరు. ఈ రెస్టారెంట్ నార్త్ కరోలినాలో ఉంది. న్యూ ఓర్లీన్స్‌లోని బ్రెన్నాస్వంటి పేరొందిన రెస్టారెంట్‌ను వెనక్కి నెట్టేసి ఇండియన్ రెస్టారెంట్ చాయ్‌పానీ ఈ ఘనత సాధించింది. జేమ్స్బియర్డ్ఫౌండేషన్అనే సంస్థ, ఈ అవార్డును చికాగోలో అందజేసింది. అయితే న్యూయార్క్బెస్ట్చెఫ్గా ఇండో అమెరికన్ చింతన్ పాండ్యా ఎంపికయ్యారు.