మంచిర్యాల జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. రెండు తులాల బంగారం స్వాధీనం.. రిమాండ్​కు తరలింపు

మంచిర్యాల జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. రెండు తులాల బంగారం స్వాధీనం.. రిమాండ్​కు తరలింపు

మంచిర్యాల జిల్లాలో  అంతర్రాష్ట్ర దొంగను  పట్టుకున్నారు.  చెన్నూరు పాతబస్టాండ్​ సెంటర్​ లో వృద్దురాలి మెడలో గొలుసు దొంగతనం కేసును పోలీసులు చేధించారు.  పోలీసులు తెలిపిన  వివరాల ప్రకారం .... మూడు రోజుల క్రితం ( మార్చి 13 నాటికి) చెన్నూరు పాత బస్టాండ్​ సెంటర్​ లో చోరీ జరిగింది.  బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు చెన్నూరుతో సహా మంచిర్యాల జిల్లాలో పోలీస్​ గస్తీ పెంచారు.

దొంగలపై నిఘా వేసిన అధికారులు అలెపు కృష్ణ అనే వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించడంతో పట్టుకున్న పోలీసులు..  అతని నుంచి రెండు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకొని .. కేసు నమోదుచేశామని మంచిర్యాల డీసీపీ భాస్కర్​ తెలిపారు.  నిందితునిపై బీఎన్​ఎస్​ చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.  దొంగలను అరికట్టడంలో ప్రతిభ కనపర్చిన పోలీసులకు డీసీపీ భాస్కర్​ రివార్డ్​ లు అందజేశారు.