జగిత్యాలలో పట్టపగలే రెచ్చిపోయిన చైన్ స్నాచర్

జగిత్యాలలో పట్టపగలే రెచ్చిపోయిన చైన్ స్నాచర్

జగిత్యాల: ఈజీ మనీ కోసం పట్టపగలే చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రోడ్లపై మహిళలలు ఒంటరిగా కనిపిస్తే చాలు వారిపై దాడికి దిగి చైన్స్ ఎత్తుకెళ్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం వాణినగర్ నటరాజ్ టాకీస్ ఎదుట శనివారం పట్టపగలే ఓ మహిళ మెడలో నుంచి గొలుసును దొంగలించడానికి యత్నించారు చైన్ స్నాచర్లు. చైన్ లాక్కెళ్తుండగా ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యయి. ఆ మహిళ ఒక్కసారి గట్టిగా అరవడంతో చైన్ స్నాచర్ అక్కడి నుండి తప్పించుకున్నారు.