- చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
జీడిమెట్ల, వెలుగు: జల్సాలకు అలవాటు పడి గంజాయి మత్తులో దారి దోపిడి చేస్తున్న ముఠాను పేట్బషీరాబాద్పోలీసులు అరెస్ట్‌చేశారు. జీడిమెట్లకు చెందిన బొల్లారం సాయికుమార్, ఏనుగుల భరద్వాజ్, సుచిత్రకు చెందిన చింతల ధనుశ్, కుత్బుల్లాపూర్ కు చెందిన శివం శుక్లా, భాగ్యలక్ష్మికాలనీకి చెందిన హర్షవర్ధన్‌తోపాటు మరో మైనర్‌బాలుడు జులాయిగా తిరుగుతూ గంజాయికు అలవాటు పడ్డారు.
గత నెల 29న రాత్రి 11 గంటలకు సుచిత్ర చౌరస్తా నుంచి వెళ్తున్న కుత్బుల్లాపూర్‌కు చెందిన పృథ్వీరాజ్నుఆపి, అతనితో గొడపడ్డారు. ఆ తర్వాత అతని మెడలోని 16 గ్రాముల గోల్డ్చైన్ను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు. గోల్డ్ చైన్‌ను రికవరీ చేశారు.