హనుమకొండలో చైన్ స్నాచర్ అరెస్ట్

హనుమకొండలో చైన్ స్నాచర్ అరెస్ట్

హనుమకొండ సిటీ, వెలుగు: హనుమకొండలోని కొత్తూరు జెండా ప్రాంతంలో మంగళవారం ఓ వృద్ధురాలి మెడలో బంగారు గోలుసును చోరీ చేసిన వ్యక్తిని పట్టణ పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. బుధవారం హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ములక వినయ్ కుమార్ (29) మద్యానికి బానిసై చోరీలకు పాల్పడుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కొత్తూర్ జెండా ప్రాంతంలోని కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకెళ్తున్న వృద్ధురాలి మెడలో నుంచి 45  గ్రాముల బంగారు గోలుసును చోరీ చేశాడు. వృద్ధురాలి ఫిర్యాదును అందుకున్న పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా 24 గంటల్లో దొంగను పట్టుకున్నారని తెలిపారు.