చైన్ స్నాచింగ్ దొంగలు పగలు రోడ్ల పైనే కాదు ఇప్పుడు రాత్రి టైమ్ లో కూడా రెచ్చిపోతున్నారు. ఎండకాలం వచ్చేసింది కదా చల్లని గాలి కోసం ఆరు బయట, బిల్టింగ్ పైన పడుకుంటే బంగారు నగలను ఎత్తుకెళ్లిపోతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఓ చైన్ స్నాచర్ హల్చల్ చేశాడు. ఇంటి దాబాపై నిద్రిస్తున్న మహిళా ( గడ్డం నిర్మల )మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసు లాక్కెల్లాడు.
రాత్రి పూట గాఢ నిద్రలో ఉన్న మహిళ తెల్లవారుజామున చూసుకునే సరికి తన బంగారం కనిపించకపోవడంతో షాకైంది. వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.