పాలు కొంటున్నట్టు నటిస్తూ.. చైన్ స్నాచింగ్

పాలు కొంటున్నట్టు నటిస్తూ.. చైన్ స్నాచింగ్

ఉప్పల్, వెలుగు: సిటీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఉప్పల్​లో చైన్​స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. విజయపురి కాలనీకి చెందిన విజయలక్ష్మి పక్కనే ఉన్న సరస్వతి కాలనీలో సోమవారం ఉదయం పాలు అమ్ముతోంది. ఈ క్రమంలో బైక్ పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి పాలు కొన్నట్టు నటిస్తూ.. ఆమె మెడలోని మూడు తులాల గోల్డ్​చైన్ లాక్కొని పరారయ్యాడు.

 పెనుగులాటలో మహిళ ముఖానికి గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.