ఒంటరి మహిళలే వాళ్ల టార్గెట్

ఒంటరి మహిళలే వాళ్ల టార్గెట్

హైదరాబాద్లో పలుచోట్ల చైన్ స్నాచింగ్ దొంగలు హల్చల్. ఎక్కువగా ఒంటరి మహిళలే టార్గెట్ చేసి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. మెడలో బంగారం వేసుకుని మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. రాచకొండ, హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో ఇద్దరు దొంగలు గంటన్నరలో ఆరు చైన్ స్నాచింగ్స్ చేశారు. అయితే సిటీలో వరుస చైన్ స్నాచింగ్ చేస్తున్న ఈ ఇద్దరు పోలీసులకు ఇంకా పట్టుబడలేదు. ఈ ఘరాన దొంగల కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. 20 టీమ్స్ గా ఏర్పడి చైన్ స్నాచర్స్ కోసం గాలిస్తున్నారు.  

చైన్ స్నాచర్స్ ఆరు చోట్లలో మొత్తం 21 తులాల బంగారం దోచుకున్నారు. రామ్ కోటిలో బైక్ దొంగతనం చేసి దొంగలు.. అదే బైక్ పై తిరుగుతూ చైన్ స్నాచింగ్ చేస్తున్నారు. పారడైజ్ దగ్గర బైక్ వదిలేసి కాచిగూడ రైల్వే స్టేషన్ వైపు ఆటోలో వెళ్లినట్లు తెలుస్తోంది. అంతకు ముందు రోజు ఈ దొంగలు  బెంగుళూరులో చైన్స్ స్నాచింగ్స్ చేసి హైదరాబాద్ కి వచ్చినట్లు సమాచారం. నిందితులు యూపీకి చెందిన పింకు, అశోక్ గా గుర్తించారు. గతంలో కూడా వీరు చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డారని, వీరిపై పలు కేసులు ఉన్నయని పోలీసులు వెల్లడించారు.