ఖమ్మం జిల్లాలో చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్నాచర్ల హల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఖమ్మం జిల్లాలో చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్నాచర్ల హల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     గంటల వ్యవధిలోనే మూడు చోట్ల చోరీ

పెనుబల్లి/వేంసూరు, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి, వేంసూరు మండలాల్లో శుక్రవారం చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్నాచర్లు హల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. గంటల వ్యవధిలోనే మూడు చోట్ల చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్నాచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే... కల్లూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన దంపతులు కిక్కిరెడ్డి ఈశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పద్మారెడ్డి మధిర మండలం సిరిపురం గ్రామం నుంచి ఏపీలోని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా తిరువూరు మీదుగా పెనుబల్లి మండలం వీఎం బంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వస్తున్నారు. ఈ టైంలో ఇద్దరు వ్యక్తులు రాష్ట్ర సరిహద్దు నుంచి ఈశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెంబడించారు. 

కుప్పెనకుంట్ల గ్రామం వద్దకు రాగానే పద్మారెడ్డి మెడలో ఉన్న గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాగారు. తర్వాత బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఢీకొట్టడంతో భార్యాభర్తలిద్దరూ కిందపడ్డారు. పద్మారెడ్డి మెడలో ఉన్న మరో చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాగేందుకు ప్రయత్నించగా వారు కేకలు వేయడంతో చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్నాచర్లు పరార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. అక్కడి నుంచి గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవే మీదుగా కారాయిగూడెం గ్రామం చేరుకున్న స్నాచర్లు నడుచుకుంటూ వెళ్తున్న కందమళ్లవారి బంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన మోదుగు కుమారి మెడలోని నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తాడును ఎత్తుకెళ్లారు. 

తర్వాత వేంసూరు మండలం చౌడారం తండాలో గుగులోతు నాగమణి వద్ద నుంచి చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాక్కెళ్లారు. చోరీల సమాచారం అందుకున్న పెనుబల్లి, కల్లూరు, వేంసూరు, సత్తుపల్లి పోలీసులు స్నాచర్ల కోసం గాలింపు మొదలుపెట్టారు.