శామీర్ పేట, వెలుగు : మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రానికి చెందిన అత్తెల్లి బసవమ్మ ఇంటి ముందు ఆరబోసిన ధాన్యాన్ని నేర్పుతుండగా గుర్తు తెలియని ఇద్దరు యాక్టీవా పై వచ్చి ఆమె మెడలో నుంచి పుస్తెల తాడు లాక్కెళ్లారు.
ఆమె కేకలు వేయగా స్థానికులు గమనించి దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులకు సమాచారాన్ని అందించగా ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పుస్తెల తాడు సుమారు 4 తులాలు ఉంటుందని బాధితురాలు తెలిపింది.