
హైదరాబాద్ వాసులు మీ ఇంటికి టూ లెట్ బోర్డు పెడితే అలర్ట్ గా ఉండండి. ఈ మధ్య కొందరు కేటుగాళ్లు టూ లెట్ అని బోర్డు పెట్టిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. ఇళ్లు అద్దె ఎంత..అని అడగడానికి ఇంట్లోకి వెళ్లి మహిళల మెడలో నుంచి బంగారు చైన్ లు ఎత్తుకెళ్తున్నారు. లేటెస్ట్ గా సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఇలాంటి ఘటనే జరిగింది.
మారేడుపల్లి పోలీస్టేషన్ పరిధిలో టూ లెట్ బోర్డు ఉన్న షట్టర్ .. అద్దెకు కావాలంటూ ఓ యువకుడు వచ్చాడు.. షట్టర్ చుపించిన తరువాత మంచి నీళ్ళు కావాలని అడగడంతో వృద్దురాలు ఇంట్లోకి వెళ్లింది. దీంతో వెంటనే ఎవరు లేరని గమనించి ఇంట్లోకి వెళ్లిన చైన్ స్నాచర్. మంచి నీళ్ళు తీసుకొని వస్తున్న వృద్దురాలిని నెట్టేసి మెడలోని 10 తులల బంగారు చైన్ లాక్కోని వెంటనే బయట డోర్ ను గడియ పెట్టి పారిపోయాడు. వృద్దురాలి అరుపులు విన్న స్థానికులు వెంటనే ఇంట్లోకి వచ్చి చూడగా..మెడలోని గోలుసు లాక్కోని వెళ్ళాడని చెప్పడంతో మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైన్ స్నాచర్ బైక్ పై వచ్చి ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న విడియోలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు..