- వృద్ధురాలి మెడలోని 5 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు
గచ్చిబౌలి, వెలుగు: వృద్ధురాలి మెడలోని బంగారాన్ని చైన్ స్నాచర్లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుడా ట్రేడ్ సెంటర్ లోని సాయి భరత్ ఆర్కిడ్ అపార్ట్మెంట్లో ఉంటున్న కోట సుబ్బరత్నమ్మ(50) గురువారం మధ్యాహ్నం దగ్గరలోని స్కూల్లో చదువుతున్న మనవరాలిని తీసుకురావడానికి వెళ్లింది.
1.15 గంటలకు మనవరాలితో కలిసి ఇంటికి వెళ్తుండగా.. మారుతి హాస్పిటల్ వద్ద బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వృద్ధురాలి మెడలోని 5 తులాల పుస్తెల తాడును లాక్కుని పరారయ్యారు. సుబ్బరత్నమ్మ చందానగర్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.