హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. మహిళ మేడలో చైన్ లాక్కెళ్లారు..

హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. మహిళ మేడలో చైన్ లాక్కెళ్లారు..

హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు.. అత్తాపూర్ పరిధిలోని శివరాంపల్లి సర్వారెడ్డి కాలనిలో నడుచుకుంటూ వెళుతున్న మహిళ మేడలో చైన్ లాక్కెళ్లారు దుండగులు. మంగళవారం ( ఫిబ్రవరి 25 ) చోటు చేసుకుంది ఈ ఘటన. శుభకార్యానికి వెళ్లిన మహిళ ఇంటికి తిరిగి వస్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మేడలో చైన్ దొంగలించారు.

మహిళ మేడలో చైన్ బలంగా లాగడంతో ఆమె ఒక్కసారిగా కింద పడింది. ఈ క్రమంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.