కాలింగ్ బెల్ కొట్టి.. చైన్ స్నాచింగ్.. అర్ధరాత్రి నాలుగు ఇండ్లలో చోరీ

కాలింగ్ బెల్ కొట్టి.. చైన్ స్నాచింగ్.. అర్ధరాత్రి నాలుగు ఇండ్లలో చోరీ
  • కాలింగ్ బెల్ కొట్టి.. చైన్ స్నాచింగ్.. అర్ధరాత్రి నాలుగు ఇండ్లలో చోరీ
  • డోర్ తీసిన మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగుడు
  •  నార్సింగిలో రెచ్చిపోతున్న దొంగలు
  •  తాజా సన్‌‌‌‌సిటీలో మరో సీన్

 గండిపేట్, వెలుగు: నార్సింగి పీఎస్ పరిధిలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలో బుధవారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న నాలుగు ఇండ్లలో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే సన్‌‌‌‌సిటీలో మరో చోరీ జరిగింది. ఇంట్లో తలుపులు వేసుకొని ఉన్న మహిళ మెడలో నుంచి ఓ దుండగడు పుస్తెలతాడు లాక్కెళ్లిపోయాడు. 

సన్​సిటీలోని విజయ అపార్ట్ మెంట్‌‌‌‌ మొదటి అంతస్తులో మల్లికార్జున్‌‌‌‌ తన భార్య మంజుల, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఓ దొంగ పక్క బిల్డింగ్‌‌‌‌లో నుంచి విజయ అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లోకి ప్రవేశించాడు. ఆపై మల్లికార్జున్‌‌‌‌ ఇంటి కాలింగ్​ బెల్​ను కొట్టగా, తలుపులు తెరిచిన మంజుల మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెలతాడును లాక్కెళ్లిపోయాడు. 

దుండగుడు ముఖానికి మాస్క్‌‌‌‌ ధరించి ఉన్నాడని బాధితురాలు తెలిపింది. ఆమె ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, త్వరలో చైన్‌‌‌‌ స్నాచర్‌‌‌‌ను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రత్యేక టీమ్​లను ఏర్పాటు చేసి నిఘాను పెంచుతున్నట్లు వివరించారు.