మంచినీళ్లు అడిగి.. పుస్తెలతాడు ఎత్కపోయిన్రు

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నరసమ్మ అనే మహిళ మెడలోంచి పుస్తెలతాడును అపహరించారు. నర్సమ్మ ఇంటికి వెళ్లిన దుండగులు మంచినీళ్లు కావాలని అడిగి..ఆమె తలపై కొట్టి మూడు తులాల గొలుసును లాక్కొని వెళ్లారు.

నర్సమ్మకు తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.