సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఇంట్లో చొరబడి కళ్లల్లో కారం కొట్టి మహిళ మెడలోంచి పుస్తెల తాడు ఎత్తుకెళ్లారు. జేజేనగర్ ప్రాంతానికి చెందిన శైలజ ఇంట్లో పనిచేస్తుండగా ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆమె కళ్లలో కారం కొట్టి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తెంపుకొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అల్వా్ల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
శైలజ నివాస ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఇదే అదనుగా చైన్ స్నాచర్లు రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.