హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్: వృద్ధురాలి మేడలో చైన్ లాక్కెళ్లిన చైన్ స్నాచర్..

హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్: వృద్ధురాలి మేడలో చైన్ లాక్కెళ్లిన చైన్ స్నాచర్..

హైదరాబాద్ లోని చైతన్యపురిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది.. ఓ వృద్ధురాలి మేడలో 3తులాల నాంతాడు లాక్కెళ్లాడు చైన్ స్నాచర్. సోమవారం ( సెప్టెంబర్ 30, 2024 ) సాయంత్రం చోటు చేసుకుంది ఈ ఘటన. స్థానిక అలకాపురి కాలనిలోని రోడ్ నంబర్ 8లో ఓ వృద్ధురాలు కిరాణా షాపుకు వెళ్తుండగా బైక్ పై వచ్చిన చైన్ స్నాచర్ ఆమె మేడలో చైన్ లాక్కెళ్లాడు.

2లక్షల 50వేల విలువ జేసే  మూడు తులాల నాను గొలుసు దొంగలించి చైన్ స్నాచర్ పరారయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది వృద్ధురాలు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు చైతన్యపురి పోలీసులు.

ALSO READ | హైదరాబాద్ లో మహిళ దారుణ హత్య..