నార్సింగిలో చైన్ స్నాచింగ్.. మహిళ మెడలోంచి 5తులాల గోల్డ్ చైన్ లాక్కెళ్లిన దొంగ

నార్సింగిలో చైన్ స్నాచింగ్.. మహిళ మెడలోంచి 5తులాల గోల్డ్ చైన్ లాక్కెళ్లిన దొంగ

రంగారెడ్డిజిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారం పుస్తెల తాడు లాక్కెళ్లారు. మహిళ అరుపులతో దొంగను పట్టుకునేందుకు ప్రయ త్నించినప్పటికీ దొంగ తప్పించుకునే పారిపోయారు. ఈ ఘటన మంగళవారం (ఫిబ్రవరి 4) మధ్యాహ్నం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్ షిప్ స్పోర్ట్స్ పార్క్ సమీపంలో జరిగింది. 

నార్సింగి పీఎస్ పరిధిలోని అల్కాపూర్ టౌన్ షిప్ స్పోర్ట్స్ పార్క్ సమీపంలో భాగ్యలక్ష్మీ అనే మహిళ నడుచుకుంటూ వెళ్తుంగా వెనకనుంచి వచ్చి ఆమె మెడలో ఉన్న ఐదు తులాల బంగారం పుస్తెలు తాడు లాక్కొని పరారయ్యాడు.

 చైన్ లాక్కెళ్తుండగా మహిళ కిందపడి పోయింది. చైన్ స్నాచింగ్ కు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగ ఆచూకీకోసం గాలింపు చేపట్టారు.