సూర్యాపేటలో చైన్ స్నాచింగ్.. దొంగను పట్టుకొని దేహశుద్ది చేసిన స్థానికులు

చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ దొంగను పట్టుకొని దేహశుద్ది చేసిన ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది. సూర్యాపేట 60 ఫీట్ రోడ్డు నలంద జూనియర్ కళాశాల వద్ద చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. పట్టపగలే చైన్ స్నాచింగ్ పాల్పడ్డాడు ఓ దొంగ.

వృద్ధురాలి మెడలో నుండి 2 తులాల బంగారు గొలుసు అపహరించి పారిపోతుండగా దొంగ ను పట్టుకున్నారు స్థానికులు. దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.