
కేటుగాళ్లు చోరీల కోసం ఒక్కొక్కరు ఒక్కో రూట్ ఎంచుకుంటున్నారు. అమాయకులను ఆసరగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. కూలీ పని ఉందని ఓ మహిళను తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడ లో నుంచి పుస్తెల తాడు లాక్కెళ్లిండు. ఈ ఘటన మహబూబాబాద్ లో జరిగింది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఓ మహిళ కూలి మెడలో నుంచి రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లిండు గుర్తు తెలియని వ్యక్తి. కూలి పని కోసం అడ్డ మీదికి వచ్చిన మహిళను ఆసరాగా చేసుకుని కూలి పని ఉంది అని చెప్పి టూ వీలర్ వెహికల్ పై ఎక్కించుకొని తీసుకెళ్లిండు. కొద్ది దూరం వెళ్లాక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి మహిళను బెదిరించి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడును ఎత్తుకెళ్లిండు. బాధిత మహిళకు మాటలు రాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ దొంగ మహిళను ద్విచక్ర వాహనంపై తీసుకెళుతుండగా సీసీ ఫుటేజ్ లో రికార్డయింది. దీని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
►ALSO READ | ప్రభుత్వాస్పత్రిలో రాత్రిపూట డాక్టర్లు ఉండరా..? : మంత్రి సీతక్క