
చెన్నై సిటీ హడలెత్తిపోయింది.. ఒకే ఒక్క గంట.. 60 నిమిషాల్లో ఎనిమిది చైన్ స్నాచింగ్స్.. చెన్నై సిటీ వ్యాప్తంగా వచ్చిన అఫిషియల్ కంప్లయింట్స్ ఇవి.. గంటలోనే 8 ప్రాంతాల్లో.. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళల గొంతులను చీల్చుతూ.. బైక్ పై వచ్చి బంగారం గొలుసులను లాక్కెళ్లారు. 2025, మార్చి 25వ తేదీ ఉదయం జరిగిన ఈ ఘటన చెన్నై సిటీ జనాన్నే కాదు.. సిటీ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. వరసగా వస్తున్న కంప్లయింట్స్ తో పోలీసులు సైతం ఉరుకులు పరుగులు పెట్టారు.
సిటీలో ఒకే ఒక్క గంటలో.. ఎనిమిది చోట్ల జరిగిన చైన్ స్నాచింగ్స్ పై అప్పటికప్పుడు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసింది తమిళనాడు పోలీసు శాఖ. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బైక్ నెంబర్లు స్పష్టంగా లేదు.. ఆయా ప్రాంతాల్లో విచారణ వేగవంతం చేశారు. చైన్ స్నాచింగ్స్ కు ఉపయోగించిన బైక్స్ అన్నీ దొంగతనానికి గురైనవిగా గుర్తించారు. ఆయా బైక్ యజమానులు పోలీస్ కంప్లయింట్ ఇచ్చినట్లు కూడా గుర్తించారు. దీంతో పోలీసులకు ఓ విషయం స్పష్టం అయ్యింది. మొదట బైక్స్ దొంగతనం చేసి.. ఆ తర్వాత చైన్ స్నాచింగ్స్ పాల్పడుతున్నట్లు నిర్థారణకు వచ్చారు.
Also Read:-టార్గెట్ స్కూలు టీచర్.. రూ.78 లక్షలు మింగేసిన మోసగాళ్లు.. ఎలా అంటే..?
ఈ క్రమంలోనే వాళ్లకు ఓ భయంకరమైన విషయం తెలిసింది. చెన్నై సిటీలో వరసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్స్ వెనక అంతరాష్ట్ర ముఠా ఉన్నట్లు గుర్తించారు. వాళ్లు తమిళనాడు వాళ్లు కాదు.. మహారాష్ట్ర నుంచి వచ్చారని ఓ క్లారిటీకి వచ్చారు పోలీసులు. నిఘా పెట్టారు.. చైన్ స్నాచింగ్స్ జరిగిన ప్రాంతాల్లో సెల్ ఫోన్ టవర్స్ ఆధారంగా ట్రాక్ చేశారు. ఈ క్రమంలోనే చైన్ స్నాచర్స్ సిటీ శివార్లలోని తారామణి రైల్వే బ్రిడ్జి దగ్గర ఉన్నట్లు గుర్తించారు. పోలీస్ టీం అక్కడికి చేరుకోగానే.. ముగ్గురు దొంగలు కాల్పులు జరిపారు. పోలీసులు సైతం ఆత్మరక్షణలో భాగంగా ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 ఏళ్ల జాఫర్ గులాం హుస్సేన్ అనే యువకుడు చనిపోయాడు. మరో దొంగ ఇరానీని అరెస్ట్ చేశారు పోలీసులు.
వీళ్ల నుంచి దొంగించిన బైక్స్, కొంత బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పోలీస్ కమిషన్ పరిశీలించారు. ఆత్మ రక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని.. దొంగలే ముందుగా ఫైరింగ్ ఓపెన్ చేశారని.. వాళ్ల దగ్గర లోకల్ మేడ్ తుపాకులు ఉన్నాయని.. కాల్పుల తర్వాత వాటిని కూడా సీజ్ చేసినట్లు వెల్లడించారు పోలీస్ కమిషనర్ అరుణ్.
చెన్నై సిటీని హడలెత్తించిన చైన్ స్నాచింగ్స్ దొంగ ఒకడు ఎన్ కౌంటర్ కావటం సంచలనంగా మారింది.