రూట్ అడిగి బంగారు గొలుసు లాక్కెళ్లిన్రు

రూట్ అడిగి బంగారు గొలుసు లాక్కెళ్లిన్రు

జక్రాన్​పల్లి, వెలుగు :  నిజామాబాద్  జిల్లా జక్రాన్​పల్లి మండలంలో గురువారం చెయిన్  స్నాచింగ్  జరిగింది. వెంకటేశ్వర కాలనీకి చెందిన స్వర్ణ అనే మహిళ బీడీలు తీసుకొని రోడ్డుపై వెళ్తుండగా.. బైక్ పై ఇద్దరు యువకులు ఆమె దగ్గరకు వెళ్లారు. మహారాష్ట్రకు ఎలా వెళ్లాలంటూ ఆమెను మాటల్లో పెట్టి, మెడలో ఉన్న రెండు తులాల చైన్  లాక్కెళ్లారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇందిరమ్మ కాలనీలో మరో మహిళ చైన్  లాగేందుకు యత్నించగా, ఆమె గట్టిగా అరవడంతో పారిపోయారు.