వచ్చే ఏడాది నుంచి డిగ్రీ స్టూడెంట్లకు స్టడీ మెటీరియల్ : చైర్మన్  బాలకిష్టారెడ్డి

వచ్చే ఏడాది నుంచి డిగ్రీ స్టూడెంట్లకు స్టడీ మెటీరియల్ : చైర్మన్  బాలకిష్టారెడ్డి
  • హయ్యర్  ఎడ్యుకేషన్ కౌన్సిల్  చైర్మన్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు : వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకు స్టడీ మెటీరియల్  అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్  చైర్మన్  బాలకిష్టారెడ్డి తెలిపారు. అన్ని గ్రూపుల సబ్జెక్టులకు యూజీసీ రూల్స్ కు తగ్గట్లుగా మెటీరియల్ తయారుచేసి ఇస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఎంపిక చేసిన కాలేజీల్లో బీఏ కోర్సులో డిఫెన్స్  అండ్  సెక్యూరిటీ కోర్సును ప్రవేశపెట్టే యోచన ఉందని చెప్పారు.

సోమవారం ఉన్నత విద్యా మండలి ఆఫీసులో టీజీసీహెచ్ఈ డైరీ, క్యాలెండర్ ను టీఏఎఫ్​ఆర్సీ చైర్మన్  గోపాల్ రెడ్డి, కౌన్సిల్  వైస్  చైర్మన్లు మహమూద్,ఇటిక్యాల పురుషోత్తంతో కలిసి బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే విద్యా సంవత్సరం డిగ్రీ సిలబస్​ లో మార్పులు చేయబోతున్నామన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా సబ్జెక్ట్  ఎక్స్ పర్ట్స్​తో కమిటీలు వేశామని వెల్లడించారు.