జనగామ, వెలుగు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని విమర్శించే అర్హత ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములుకు లేదని జనగామ మార్కెట్‌కమిటీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం అన్నారు. గురువారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ బేరసారాల కోసమే ఆయన ప్రయత్నం చేస్తున్నాడని, అసలు ఆయన బీఆర్‌ఎస్‌లో ఉన్నాడో లేడో కూడా పార్టీ శ్రేణులకు తెలియదన్నారు.
ఎలక్షన్ల ముందురావడం టికెట్ అడగడం, తర్వాత కనిపించకుండా పోవడం ఆయనకు అలవాటేనని ఎద్దేవా చేశారు. ఏ రోజూ పార్టీ జెండా మోయని వ్యక్తులు స్థానికత పేరుతో ఎమ్మెల్యే టికెట్ అడగడం హాస్యాస్పదం అన్నారు. ముత్తిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.