కరెంట్ సమస్యల పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ : సీజీఆర్ఎఫ్ చైర్మన్ ​నారాయణ

కరెంట్ సమస్యల పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ : సీజీఆర్ఎఫ్ చైర్మన్ ​నారాయణ

తిర్యాణి, వెలుగు: కరెంటు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి కన్జ్యూమర్ ఫోరమ్ (సీజీఆర్ఎఫ్) పనిచేస్తోందని ఆ సంస్థ చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని తిర్యాణి, జైనూర్, కెరమెరి, సిర్పూర్ యు, లింగాపూర్ మండలాల విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తిర్యాణి సబ్​స్టేషన్​లో నిర్వహించారు. పలువురు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుకున్నారు. 

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ వినియోగదారుల ఫిర్యాదులు, రైతుల కరెంటు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యుత్ కు సంబంధించి ఏ సమస్యలున్నా కన్జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఆయా మండలాల్లో ట్రాన్స్​ఫార్మర్ల వద్ద కంచెలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సకాలంలో కరెంట్ బిల్లులు చెల్లించి సంస్థ పురోగతికి ప్రజలంతా సహకరించాలని కోరారు. సీజీఆర్ఎఫ్ మెంబర్స్ సలంద రామకృష్ణ, లకావత్ కిషన్, మర్రిపల్లి రాజాగౌడ్, ఏసీ శేషారావు, డీఈఈ జీవరత్నం, ఏవో లక్ష్మీకుమార్, ఏఏవో తుకారం, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ రవీందర్, ఆయా మండలాల విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.