చొప్పదండి, వెలుగు: చొప్పదండి మున్సిపాలిటీలో రూ.36లక్షలతో 4 స్వచ్ఛ ఆటోలు కొనేందుకు కౌన్సిల్ తీర్మానం చేసినట్లు చైర్‌పర్సన్ గుర్రం నీరజ తెలిపారు. శనివారం మున్సిపల్ ఆఫీసులో చైర్‌పర్సన్ అధ్యక్షతన జనరల్‌బాడీ మీటింగ్ జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా, తహసీల్ ఆఫీసు సమీపంలోని పబ్లిక్ టాయిలెట్స్ రిపేర్ కోసం రూ.2లక్షలు, రూ.13 లక్షలతో డంపింగ్ యార్డు, బయోమైనింగ్, ఎఫ్ఎస్‌టీ ప్లాంట్ల నిర్వహణ, రూ.13 లక్షలతో 35కేవీ నాన్ డొమెస్టిక్ లోడ్ 63 కేవీఏ డీటీఎస్ విద్యుత్ సౌకర్యం కల్పించటం, రూ.5లక్షలతో డంపింగ్ యార్డులో డీఆర్సీసీ షెడ్డు.. తదితర పనులకు కౌన్సిల్ ఆమోదించినట్లు తెలిపారు. సమావేశంలో వైస్ చైర్‌పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, కమిషనర్ కె.నాగరాజు, కౌన్సిలర్లు, మేనేజర్ ప్రశాంత్, పాల్గొన్నారు.