సింగరేణి సంస్థ పరిరక్షణే ఐఎన్టీయూసీ లక్ష్యం : జనక్ ప్రసాద్

సింగరేణి సంస్థ పరిరక్షణే ఐఎన్టీయూసీ లక్ష్యం : జనక్ ప్రసాద్

నస్పూర్, వెలుగు: సింగరేణి సంస్థ పరిరక్షణే ఐఎన్టీయూసీ లక్ష్యమని, ఆ దిశగా ముందుకు సాగుతామని సంఘం సెక్రటరీ జనరల్, తెలంగాణ ప్రభుత్వ కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ అన్నారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్​లో మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంస్థను నాశనం చేశారని మండిపడ్డారు.

బొగ్గు గనుల వేలంలో  సింగరేణి సంస్థను పాల్గొనకుండా చేసి కేసీఆర్.. తమ దగ్గరి వాళ్లకు ఇప్పించుకున్నారని ఆరోపించారు.  బీఆర్ఎస్ రాకముందు 67 వేల మంది కార్మికులుంటే 42 వేల మందికి తగ్గించిందన్నారు. లీడర్లు శంకర్ రావు, నరసింహ రెడ్డి, కాంపెల్లి సమ్మయ్య, కలవేన శ్యామ్, గరిగె స్వామి, మైనింగ్ స్టాఫ్ ఇన్​చార్జి తిరుపతి రాజు తదితరులు పాల్గొన్నారు.