- ఎమ్మెల్యే అండతోనే స్కామ్జరిగింది
- టీపీసీసీ ఐటీ సెల్చైర్మన్మదన్మోహన్రావు
లింగంపేట, వెలుగు : లింగంపేట సింగిల్‌విండో లో రూ.73 లక్షల నిధుల దుర్వినియోగానికి పాల్పడిన చైర్మన్ కూచన్‌పల్లి దేవేందర్‌రెడ్డి, సీఈవో సందీప్‌కుమార్‌లను వెంటనే సస్పెండ్ చేయాలని ఐటీ సెల్‌చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్మోహన్రావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన కాంగ్రెస్‌పార్టీ లీడర్లు, కార్యకర్తలతో కలిసి సొసైటీ ఎదుట ఆందోళన చేపట్టారు. మదన్మోహన్రావు మాట్లాడుతూ.. లింగంపేట సొసైటీ అభివృద్ధిలో ఒకప్పుడు రాష్ట్రంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉండగా, ఇప్పుడు పూర్తిగా అవినీతిమయమైందన్నారు. రైతుల సొమ్మును సీఈవో, చైర్మన్ దుర్వినియోగం చేసినట్లు పాలకవర్గ సభ్యులు ఫిర్యాదు చేయగా, ఎమ్మెల్యే ఒత్తిడితోనే కోపరేటీవ్ ఆఫీసర్లు విచారణను ముమ్మరం చేయలేదని విమర్శించారు.
విచారణ చేసేందుకు ఏడాది సమయం పడుతుందా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అండతోనే సొసైటీలో స్కామ్జరిగిందని మదన్మోహన్రావు ఆరోపించారు. ఎమ్మెల్యేకు ఎంత కమీషన్ అందిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. లింగంపేట శివారులోని సర్వేనెంబర్983లో ఉన్న 450 ఎకరాల అసైన్డ్‌భూమిని 50 ఏండ్ల కింద ప్రభుత్వం పేదలకు పంచగా, వాటికి రైతు బంధు ఇచ్చిన ప్రభుత్వం, నేడు రైతుల పట్టా భూములను ధరణి వెబ్సైట్ నుంచి తొలగించిందని పేర్కొన్నారు.
రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల వివరాలను ధరణిలో నమోదు చేసి, రైతుబంధు అందేలా చూడాలని తహసీల్దార్ రాజేశ్వర్‌కు వినతిపత్రం ఇచ్చారు.15 రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు బుర్ర నారాగౌడ్, జొన్నల రాజు, రఫీయోద్దీన్, సాజీద్, ప్రసాద్‌గౌడ్, ఇర్ఫాన్, గోవింద్
పాల్గొన్నారు.