మార్కెట్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం :జాగిరపు రజిత

మార్కెట్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం :జాగిరపు రజిత

గంగాధర, వెలుగు: వ్యవసాయ మార్కెట్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని గంగాధర మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్​ జాగిరపు రజిత- శ్రీనివాస్​రెడ్డి అన్నారు. స్థానిక మార్కెట్​ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో బుధవారం సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన అభివృద్ధి పనులు, భవిష్యత్ కార్యకలాపాలపై డైరెక్టర్లతో చర్చించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ తోట కరుణాకర్, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.