
హనుమకొండ సిటీ, వెలుగు : వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వార్షిక టర్నోవర్ రూ.2వేల కోట్లు సాధించినట్లు రాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు తెలిపారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్ట డీసీసీబీ కార్యాలయంలో బ్యాంక్ మేనేజర్లు, సీఈవోలతో సమావేశం నిర్వహించారు.
రుణమాఫీ 2024 కింద లబ్ధిపొందిన రైతులకు కొత్త రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రూ.2 వేల కోట్ల టర్నోవర్ సాధించడానికి సహకరించిన పాలకవర్గానికి, ఉద్యోగులకు, సహకార సంఘాల అధ్యక్షులు, ఖాతాదారులకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో బ్యాంక్ సీఈవో వజీర్ సుల్తాన్, జీఎం ఉషా, డీజీఎం అశోక్, ఏజీఎంలు మధు, స్రవంతి, కృష్ణమోహన్, రాజునాయక్ పాల్గొన్నారు.