అబద్ధాలు చెప్పుట్ల కేటీఆర్, హరీశ్ పోటీ : సాయికుమార్

  • ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ సాయికుమార్

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్ ప్రభుత్వ కృషితోనే మత్స్యశాఖకు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ వెల్లడించారు. శనివారం ఆయన గాంధీ భవన్​లో  మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నీలి విప్లవం వల్లే అవార్డు వచ్చిందని కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. 

అబద్ధాల ప్రచారంలో కేటీఆర్, హరీశ్​ రావు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. బీమా పథకంతో 4.16 లక్షల మంది మత్స్య కార్మికుల జీవితాలు కాపాడేందుకు  రేవంత్ సర్కార్  రూ.139 కోట్లు ప్రీమియం చెల్లించినందుకే ఈ అవార్డు వచ్చిందన్నారు.