గంగపుత్రులు రాజకీయంగా ఎదిగేలా సీఎం నిర్ణయాలు :మెట్టు సాయికుమార్

గంగపుత్రులు రాజకీయంగా ఎదిగేలా సీఎం నిర్ణయాలు :మెట్టు సాయికుమార్
  • ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గంగపుత్రులు రాజకీయంగా ఎదుగుదలకు సీఎం రేవంత్ రెడ్డి కృషిచేస్తున్నారని ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. నామినేటెడ్ పదవులతో పాటు ఉన్నతమైన పదవులకు అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు.శుక్రవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మెట్టు ధనరాజ్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది.

ముఖ్య అతిథిగా మెట్టు సాయికుమార్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, వి.సి ప్రొఫెసర్ తోపారపు గంగాధర్ హాజరయ్యారు. సాయికుమార్ మాట్లాడుతూ..గంగ పుత్రులను రాజకీయ, ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. వారి అభివృద్ధికి గత పాలకుల కంటే రెట్టింపుగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నారని తెలిపారు.