- రైతు కమిషన్చైర్మన్ కోదండ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఇథనాల్ ఇండస్ట్రీతో లాభం ఎంత ఉందో, కాలుష్యం కూడా అంతే స్థాయిలో ఉందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. ఇథనాల్ కంపెనీల వల్ల కాలుష్యం పెరుగుతోందని అక్కడి ప్రజలు, రైతులు ఆయనకు ఫిర్యాదులు చేశారు. దీనిపై వ్యవసాయ, కాలుష్య, పరిశ్రమల అధికారులతో సమావేశాలు నిర్వహించి మాట్లాడామని రైతులకు చైర్మన్ తెలిపారు.
సమావేశంలో వారి అభిప్రాయాలు తెలుసుకున్నామని, క్షేత్రస్థాయిలో వెళ్లి వివరాలు తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రైతుల క్షేమం విషయంలో సర్కారు ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్తామని, ఇథనాల్ కంపెనీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయని, అన్ని పరిశీలించి నివేదిక రూపొందిస్తామని తెలిపారు.