
కాశీబుగ్గ, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం సర్వమతాల సామరస్యాన్ని పాటిస్తున్నదని రాష్ర్ట హజ్కమిటీ చైర్మన్ ఖుసురుపాషా అన్నారు. శుక్రవారం రాత్రి వరంగల్ అబ్నూస్ ఫంక్షన్హాల్లో 21వ డివిజన్ కార్పొరేటర్ పూర్ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఖుసురుపాషా, మహ్మద్ఆయూబ్ ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే రంజాన్ పండుగకు ప్రభుత్వ సహకారం ఉండాలన్నారు. కార్యక్రమంలో టీవీ కామీడియన్ ఖయ్యూమ్ లోబో, ఉర్సు దర్గా ఫీఠాధిపతి హసీం ఖాధీర్, షోయాబ్ బాబా, ఖాళీ సయ్యద్, మౌలానా ఫసీయోద్దీన్, మత పెద్దలు, ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.