బీఆర్ఎస్ హయాంలో ఎవరూ బాగుపడలే : జక్క రాజేశ్వర్

బాల్కొండ, వెలుగు:  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరూ బాగుపడలేదని వేంపల్లి సొసైటీ చైర్మన్ జక్క రాజేశ్వర్ ఆరోపించారు. శుక్రవారం ముప్కాల్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రుణ మాఫీ పేరుతో   రైతులను మోసం చేసిందన్నారు. ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదన్నారు.  మంత్రిగా ప్రశాంత్ రెడ్డి ఎంత మందికి డబుల్ బెడ్రూం ఇచ్చారో చెప్పాలన్నారు.  

కాంగ్రెస్​ ప్రభుత్వానికి అభివృద్ధిపై సూచనలు, సలహాలు ఇయ్యాల్సింది పోయి బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. కార్యక్రమంలో సరికెల చిన్న గంగారాం, గంగమల్లు, శశికుమార్, జగదీశ్, దేశ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.