15మంది ట్రినిటి స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ జాబ్స్

కరీంనగర్ టౌన్, వెలుగు: ట్రినిటి ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం నిర్వహించిన క్యాంపస్​ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో తమ కాలేజీకి చెందిన 15 మందికి జాబ్స్‌‌‌‌‌‌‌‌ వచ్చినట్లు చైర్మన్ ప్రశాంత్ రెడ్డి  పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంధన్  బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్ మెంట్ లో  80మంది  విద్యార్థులు  పాల్గొనగా, 15మందికి ఉద్యోగాలు వచ్చినట్లు చెప్పారు.

 వారికి బంధన్ బ్యాంకు  హెచ్ఆర్  సోంరాజ్  దత్త, జయరాం,శ్రీనివాస్ అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్ లెటర్లు ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో  ప్రిన్సిపాల్  డా. నాగేంద్ర సింగ్ , రాధాకృష్ణ, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.