అల్ఫోర్స్ విద్యార్థులకు పతకాలు

అల్ఫోర్స్ విద్యార్థులకు పతకాలు

కొత్తపల్లి, వెలుగు : యునిఫైడ్ కౌన్సిల్ జాతీయస్థాయి ఒలింపియాడ్‌‌‌‌‌‌‌‌లో అల్ఫోర్స్‌‌‌‌‌‌‌‌ విద్యార్థులు పతకాలు సాధించినట్లు చైర్మన్​ వి.నరేందర్​రెడ్డి తెలిపారు. కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ ఇ -టెక్నో స్కూల్​లో బుధవారం ఏర్పాటుచేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. 

యునిఫైడ్ కౌన్సిల్ నిర్వహించిన జాతీయస్థాయి జీకే ఒలింపియాడ్​లో బి.విహార్, వి.విహాన్​శౌరి, ఎ.అక్షయగ్న, డి.సమ్మితారెడ్డి, ఎం.శివేన్​రెడ్డి, వి.జయంత్ క్షేత్రజ్ఞ, ఇ.ఆరుష్​పటేల్ పతకాలు సాధించారని పేర్కొన్నారు.