సిద్దిపేట టౌన్, వెలుగు: భారత ఆర్థిక సర్వే లో సిద్దిపేటకు గుర్తింపు రావడంపై సంతోషంగా ఉందని సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ఆఫీసులో కమిషనర్ ప్రసన్న రాణి, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆలోచనతో పుట్టిన కార్యక్రమం స్టీల్ బ్యాంక్ అన్నారు.
ప్రజలకు అవగాహన కల్పిచడంలో ఆర్పీలు, కౌన్సిలర్లు, అంగన్వాడీలు ఎంతో కృషి చేశారన్నారు. అలాగే సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మాజీ జడ్పీ చైర్పర్సన్రోజా రాధాకృష్ణ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోహన్ లాల్, గుండు భూపేశ్, పాల సాయి రాం, సోమిరెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. స్టీల్ బ్యాంకు ప్రారంభించి సిద్దిపేట దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
2014 నుంచి ఇప్పటివరకు 45 అవార్డులు వచ్చాయని --సిద్దిపేట అన్ని అంశాల్లో రోల్ మోడల్ గా నిలిచిందని తెలిపారు. కౌన్సిలర్లు దీప్తి, రవి, బ్రహ్మం, సతీశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, శ్రీకాంత్, కనకయ్య, ఆంజనేయులు, రవి గౌడ్, నరేశ్ గౌడ్, లక్ష్మణ్, మెప్మా అధికారులు సాయికృష్ణ, రమ్య, జ్యోతి, పట్టణ ఆర్పీలు పాల్గొన్నారు.